harish rao: ఫేక్ న్యూస్ వేసిన పేజీలోనే రేపు క్షమాపణ చెప్పాలి: హరీష్ రావు

  • హరీష్ బీజేపీలో చేరబోతున్నారంటూ డెక్కన్ క్రానికల్ కథనం
  • చివర్లో ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ అనే విషయం మర్చిపోవద్దంటూ సూచన
  • డీసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు

టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఆ పార్టీని వీడి... బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే చివర్లో ఈ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ అందర్నీ ఫూల్స్ ను చేసింది. ఈ కథనంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నా గురించి ఓ ప్రముఖ మీడియా సంస్థ నుంచి వచ్చిన కథనం ఫేక్ న్యూస్ లకు ఒక ఉదాహరణ. తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం సరికాదు. ముఖ్యంగా దేశం మొత్తం ఫేక్ న్యూస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో ఇలా వ్యవహరించడం సముచితం కాదు.

ఇలాంటి ఫేక్ న్యూస్ ను ప్రచురించవద్దని మీడియా సంస్థలను కోరుతున్నా. ఏ పేజీలో అయితే తనపై తప్పుడు వార్తను ప్రచురించారో...  అదే పేజీలో రేపు తనకు క్షమాపణలు చెప్పాలి.' అంటూ ట్వీట్టర్ ద్వారా హరీష్ డిమాండ్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News