Rajamahendravaram: మరోసారి నన్ను ఆశీర్వదించండి: ప్రధాని మోదీ

  • దేశ ప్రగతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
  • ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంచాం
  • ఐదేళ్లలో కొత్త పన్నులు విధించలేదు 

ప్రజల ఆకాంక్షల మేరకు ఐదేళ్ల పాటు పని చేశామని, మరోసారి ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ‘మహాభారతం’కు జన్మనిచ్చిన రాజమహేంద్రవరానికి ప్రణామాలు చేస్తున్నానని, ఆదికవి నన్నయ్య, కందుకూరి వీరేశలింగం, దామెర్ల రామారావులాంటి ప్రజాసేవకులు పుట్టిన గడ్డ ఇది అని కొనియాడారు.

ఐదేళ్లలో దేశ ప్రగతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని మోదీ అన్నారు. ప్రజల కోరిక మేరకు ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచామని, ఐదేళ్లలో కొత్త పన్నులు విధించలేదని, తగ్గిస్తూ వచ్చామని చెప్పారు. పన్నులు వసూలు కాకున్నా అభివృద్ధి పనులు మాత్రం ఆగలేదని అన్నారు. కృష్ణా-గోదావరి నదుల్లో రవాణామార్గం విస్తరణ జరుగుతోందని, ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News