Galla Jayadev: సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబును గెలిపించాలంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ను కోరిన గల్లా జయదేవ్

  • గుంటూరులో ఆత్మీయ సమావేశం
  • హాజరైన తోడల్లుడు సుధీర్
  • కృష్ణ, మహేష్ బాబు అభిమానుల కోలాహలం

గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా, గుంటూరు కొత్తపేటలో కృష్ణ, మహేష్ బాబు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో మహేష్ బాబు అభిమానులందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబునాయుడుని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ కు ఓటేస్తే అది కేసీఆర్ కు వేసినట్టేనని, జగన్ ను గెలిపిస్తే మాఫియా రాజ్యం వస్తుందని అన్నారు. గుంటూరులోనే కాకుండా రాష్ట్రం మొత్తమ్మీద మహేష్ బాబు అభిమానులు టీడీపీకి మద్దతు పలకాలని కోరారు.

అంతకుముందు ఆయన, మహర్షి చిత్రంతో మహేష్ బాబు 25 సినిమాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సమావేశానికి గల్లా జయదేవ్ తోడల్లుడు, సినీ హీరో సుధీర్ కూడా హాజరయ్యారు. జయదేవ్ కార్యదక్షత ఉన్న వ్యక్తి అని, పార్లమెంట్ లో ప్రత్యేకహోదా గురించి పదేపదే గుర్తు చేయాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన వ్యక్తి జయదేవ్ అని తెలిపారు. జయదేవ్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Galla Jayadev
Mahesh Babu
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News