YSRCP: పది రోజుల కాల్ షీట్లను జగన్ కు మోహన్ బాబు అమ్ముకున్నారు: బుద్ధా వెంకన్న

  • ఎన్టీఆర్ కు, దాసరికే పంగనామాలు పెట్టాడు 
  • మోహన్ బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతితో చెప్పిస్తారా?
  • అలా చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా

వైసీపీ నాయకుడు, ప్రముఖ సినీనటుడు మోహన్ బాబుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. పది రోజుల కాల్ షీట్లను జగన్ కు మోహన్ బాబు అమ్ముకున్నారని ఆరోపించారు. సినిమాల్లో తనకు అవకాశాలు ఇప్పించిన ఎన్టీఆర్ కు, గురువు దాసరి నారాయణరావుకే పంగనామాలు పెట్టిన చరిత్ర మోహన్ బాబుది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతితో స్టేట్ మెంట్ ఇప్పిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. హైదరాబాద్ లో తనకు సెంటు స్థలం కూడా లేకపోవడానికి మోహన్ బాబే కారణమని రజనీకాంత్ గతంలో చెప్పిన విషయాన్ని బుద్ధా వెంకన్న ప్రస్తావించారు.

YSRCP
Mohanbabu
Telugudesam
Buddha venkanna
dasari
NTR
Lakshmi parvathi
jagan
rajani
  • Loading...

More Telugu News