Andhra Pradesh: ప్యాకేజీల కోసమే సినీనటులు వైసీపీలో చేరుతున్నారు: టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్

  • అబద్ధాల కోరు జగన్, ట్వీట్ రాయుడు మోదీ 
  • వీళ్లిద్దరినీ ప్రజలు నమ్మరు
  • అద్వానీని మోదీ వెన్నుపోటు పొడిచారు

అబద్ధాల కోరు జగన్, ట్వీట్ రాయుడు మోదీని ప్రజలు నమ్మరని టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. నారా లోకేశ్ పై మోదీకి ద్వేషం, అసూయ ఎందుకని, రాజకీయ భిక్ష పెట్టిన అద్వానీని మోదీ వెన్నుపోటు పొడిచారని, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన నేతలకు జగన్ మళ్లీ టికెట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరుతున్న సినీనటులపై ఆయన ఆరోపణలు గుప్పించారు. ప్యాకేజీల కోసమే సినీనటులు వైసీపీలో చేరుతున్నారని ఆరోపించారు.

Andhra Pradesh
Telugudesam
babu rajendra prasad
modi
YSRCP
advani
jagan
Tollywood
  • Loading...

More Telugu News