Deccan Chronicle: బీజేపీలో చేరనున్న హరీశ్ రావు... 'డెక్కన్ క్రానికల్'లో ఏప్రిల్ ఫూల్ డే కథనం!

  • కలకలం రేపిన పత్రిక కథనం
  • చివరిలో ఏప్రిల్ ఫూల్ అని వాక్యం
  • క్రూడ్ జోక్ పై సెటైర్లు

తెలంగాణ మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారని చెబుతూ ఓ బాంబులాంటి కథనాన్ని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ప్రచురించి తీవ్ర కలకలాన్ని రేపింది. ఇప్పటికే రాజకీయంగా హరీశ్ రావు ఊగిసలాటలో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ఈ వార్తను పత్రిక ఇచ్చింది. చివరిలో "ఇది ఏప్రిల్ ఫూల్ డే అని పాఠ‌కులు గుర్తుంచుకోవాలి" అన్న వాక్యాన్ని చూసేంత వరకూ ఈ వార్తను నిజమని నమ్మి ఆతృతగా చదివిన లక్షలాది మంది పాఠకులు, డెక్కన్ క్రానికల్ వేసిన క్రూడ్ జోక్ పై సెటైర్లు వేస్తున్నారు.

వాస్తవానికి ఓ పదేళ్ల క్రితం వరకూ ఏప్రిల్ 1న ఈ తరహా వార్తలను అన్ని దినపత్రికలూ ప్రచురించి, చివరిలో ఇది 'ఫూల్స్ డే' అని గుర్తు చేస్తుండేవి. కాలానుగుణంగా ఆ సంప్రదాయం తొలగిపోయింది. అటువంటి సమయంలో హరీశ్ రావుపై బ్యానర్ కథనంగా 'ఫూల్స్ డే స్టోరీ'ని ప్రచురించడం చర్చనీయాంశమైంది.

  • Loading...

More Telugu News