Guntur District: నేత కార్మికుల కష్టాలు తీరుస్తా: మంగళగిరి ప్రచారంలో మంత్రి లోకేశ్‌

  • పట్టణంలోని పదో వార్డులో పర్యటన
  • అచ్చువేస్తున్న నేత కార్మికునికి పలకరింపు
  • అతని సమస్యలు తెలుసుకుని ఈ విధంగా సమాధానం

మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే నేత కార్మికుల కష్టాలపై పూర్తి స్థాయిలో దృష్టిసారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ అభ్యర్థి, మంత్రి లోకేశ్‌ అన్నారు. ఈరోజు ఆయన మంగళగిరి పట్టణంలోని పదో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల్ని పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక నేత కార్మికుడు వెంకటేశ్వరరావు తన ఇంటిలో అచ్చు పనిలో ఉండగా అతన్ని, అతని భార్యను లోకేశ్ పలకరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు దంపతులు నేతపనిలో అచ్చు కీలకపాత్ర పోషిస్తుందని మంత్రికి వివరించారు. యాభై ఏళ్లుగా ఇదే పనిలో ఉన్నామని, అరకొర ఆదాయం వల్ల తమ బతుకుల్లో మార్పు రాలేదని తెలిపారు. ఈ సందర్భంగా నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే ఈ సమస్యలపై దృష్టి సారిస్తానని లోకేశ్‌ తెలిపారు.

Guntur District
Mangalagiri
Nara Lokesh
weavers
  • Loading...

More Telugu News