Tirupati: ఓటర్లకు పంచేందుకు గోడగడియారాలను సిద్ధం చేసిన వైసీపీ నేతలు: పట్టుకున్న పోలీసులు

  • తిరుపతి రూరల్‌ పద్మావతిపురంలో ఘటన
  • పార్టీ నేత గణపతినాయుడు ఇంటిపై తెల్లవారుజామున దాడి
  • భారీ సంఖ్యలో గడియారాలు, చీరలు స్వాధీనం

ఓటర్లకు వలవిసిరేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పంపిణీకి సిద్ధం చేసిన గోడ గడియారాలను పోలీసులు ఈరోజు తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రూరల్‌ ప్రాంతం పద్మావతిపురంలో నివాసం ఉంటున్న వైసీపీ నేత గణపతినాయుడు ఇంటిపై పోలీసులు తెల్లవారుజామున దాడి చేశారు. పార్టీ నాయకుని ఫొటోతో పాటు కొన్ని వ్యాఖ్యానాలతో ఈ గడియారాలు ఉన్నాయి. ఈ దాడుల్లో గోడగడియారాలు, చీరలు భద్రపరిచినట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గణపతినాయుడుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tirupati
YSRCP
watches
police case
  • Loading...

More Telugu News