anchor syamala: మేము వైసీపీలో చేరడానికి కారణం ఇదే: యాంకర్ శ్యామల

  • భర్తతో కలసి వైసీపీలో చేరిన శ్యామల
  • జగన్ విధివిధినాలు ఎంతో నచ్చాయన్న స్టార్ యాంకర్
  • పార్టీ ప్రచారంలో పాల్గొంటామంటూ వ్యాఖ్య

ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి శ్యామల తన భర్త నర్సింహారెడ్డితో కలసి వైసీపీలో చేరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ కుటుంబంలో కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జగన్ అన్నను చాలా కాలంగా పరిశీలిస్తున్నానని... ఆయన విధివిధానాలు, ఆయన చేస్తున్న మంచి పనులు తనకు ఎంతో నచ్చాయని తెలిపారు. అన్న చేస్తున్న మంచి పనుల్లో స్వయంగా పాలుపంచుకోవాలనే ఈరోజు వైసీపీలో చేరామని చెప్పారు. జగన్ అన్న చెబుతున్న నవరత్నాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, మద్యపాన నిషేధం, ఆరోగ్యశ్రీ పథకాలు తమకు ఎంతో నచ్చాయని చెప్పారు. తనకు సపోర్ట్ గా తన భర్త కూడా వచ్చారని తెలిపారు. తాము కూడా వైసీపీ ప్రచారంలో పాలుపంచుకోబోతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు వైసీపీకి ఓటు వేసి ఘన విజయాన్ని అందించాలని కోరారు.

ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ, ఏపీ ప్రజలందరితో పాటు తాము కూడా జగన్ అన్న కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. జగన్ అన్నతో కలసి నడవాలనుకుంటున్నామని చెప్పారు.

anchor syamala
tollywood
husband
ysrcp
  • Loading...

More Telugu News