Rishab pant: ఫోర్ పోతుందన్నాడు... పోయింది... రిషబ్ పంత్ మాటలతో 'ఫిక్సింగ్' అనుమానం!

  • ఊతప్ప ఫోర్ కొట్టనున్నాడన్న పంత్
  • అన్నట్టుగానే బంతిని బౌండరీ దాటించిన ఊతప్ప
  • ఫిక్సింగ్ జరిగిందని ఫ్యాన్స్ ఆగ్రహం

"ఈ బాల్ కచ్చితంగా బౌండరీ దాటుతుంది" ప్రత్యర్థి జట్టు ఆటగాడు క్రీజులో ఉండగా, కీపర్ ప్లేస్ లో ఉన్న రిషబ్ పంత్ చేసిన వ్యాఖ్యలివి. శనివారం నాడు న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ కాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న వేళ ఈ ఘటన జరిగింది. సందీప్ లామ్ చెన్ బౌలింగ్ చేస్తుండగా, కేకేఆర్ ఓపెనర్ నిఖిల్ నాయక్ తొలి వికెట్ గా అవుట్ అయిన తరువాత ఊతప్ప క్రీజ్ లోకి వచ్చాడు. ఆ సమయంలో పంత్ ఫోర్ కొడతాడని చెప్పడం, వెంటనే ఊతప్ప ఫోర్ బాదడం జరిగిపోయాయి. ఈ మాటలు స్టంప్ కు అమర్చిన మైక్ లో రికార్డు అయి, ఆపై సోషల్ మీడియాకు ఎక్కగా, పంత్, మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మూడో ఓవర్ ఐదో బంతికి ఫోర్ వస్తుందని పంత్ కు ముందే ఎలా తెలిసిందని ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్, ఇది కచ్చితంగా ఫిక్సింగ్ చేయబడ్డ మ్యాచేనని అంటున్నారు. "పంత్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి ఢిల్లీ విజయాన్ని ఆపాలని చూసినా అక్కడ పృథ్వీ షా ఉన్నాడు" అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. దీనిపై బీసీసీఐ, ఐపీఎల్, ఢిల్లీ ఫ్రాంచైజీ, కేకేఆర్ ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News