Ravichandran Ashwin: ఎక్కడ ఆడుతుంటే అక్కడ ఓటు వేసే అవకాశం ఇవ్వండి... మోదీకి ట్వీట్ చేసిన క్రికెటర్

  • ఐపీఎల్ కారణంగా బిజీ షెడ్యూల్ లో ఉన్నాం
  • మా కోసం నిబంధనలు సవరించండి
  • రవిచంద్రన్ అశ్విన్ విజ్ఞప్తి

టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఎన్నికల్లో తమకోసం నిబంధనలు సవరించాలంటున్నాడు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్ చేశాడు. ఐపీఎల్ కారణంగా తాము పోలింగ్ సమయానికి స్వస్థలాల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని, అందుకే తమకు ఎక్కడినుంచైనా ఓటు వేసే సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. పోలింగ్ వేళకు తాము ఎక్కడుంటే అక్కడే ఓటు వేసేలా అవకాశం ఇవ్వాలని కోరాడు. సాధారణంగా ఎన్నికల నియమావళి ప్రకారం ఓటరు తన స్వస్థలంలోనే ఓటు వేయాలి. కొన్ని సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు. అయితే, తాము కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్నామని, నిబంధనల్లో మార్పు తెస్తే క్రికెటర్లు కూడా ఓటు వేసేందుకు వీలు కలుగుతుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

Ravichandran Ashwin
Narendra Modi
  • Loading...

More Telugu News