Heat: నాలుగు డిగ్రీల వరకూ పెరగనున్న ఎండ వేడిమి!
- పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
- వర్షం కురవడంతో మరింత ఉక్కపోత
- రానున్న రెండు రోజుల్లో వర్షాలకు చాన్స్
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలను దాటిపోగా, రానున్న రెండు రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసిన కారణంగా రెండు, మూడు రోజుల పాటు ఉక్కపోత కూడా అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే రెండు రోజుల్లోనూ కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. కాగా, ఏపీలోని అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో 41 నుంచి 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.