USA: 13 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన తెలుగు మతబోధకుడికి అమెరికాలో ఆరేళ్ల కారాగారం

  • దోషిగా తేలిన జాన్ ప్రవీణ్
  • చర్చికి వచ్చే బాలికపై వేధింపులు
  • ఏడాది శిక్ష సరిపోదన్న న్యాయమూర్తి

తెలుగువాడైన ఓ క్రైస్తవ మతబోధకుడికి అమెరికాలో జైలుశిక్ష పడింది. ఇటుకలపాటి జాన్ ప్రవీణ్ (38) ర్యాపిడ్ సిటీ చర్చికి వచ్చే ఓ 13 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించినట్టు నిర్ధారణ కావడంతో న్యాయస్థానం ఆరేళ్ల జైలుశిక్ష విధించింది. జాన్ ప్రవీణ్ 10 ఏళ్ల ప్రత్యేక ఒప్పందం మీద 2017లో అమెరికాలోని ర్యాపిడ్ సిటీ చర్చిలో మతబోధకుడిగా వెళ్లాడు. అయితే, చర్చికి వచ్చే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో అతడిపై కేసు నమోదైంది.

విచారణ సందర్భంగా ప్రవీణ్ కు ఏడాది జైలు విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజ్ఞప్తి చేయగా, ఆ శిక్ష సరిపోదంటూ న్యాయమూర్తి స్టీఫెన్ మాండల్ ఆరేళ్ల కారాగార శిక్ష విధించారు. అతడు రిమాండ్ లో ఉన్న 178 రోజులు కూడా శిక్షాకాలం కిందకు వస్తుందని స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ తెలుగు వ్యక్తి గురించి మరో నిజం కూడా బయటపడింది. 16 ఏళ్ల అమ్మాయితో లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

USA
  • Loading...

More Telugu News