jc diwakar reddy: కులం కూడు పెడుతుందా? మంచితనం ఉంటేనే ఏ రెడ్డి అయినా గెలిచేది: జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • రెడ్డి.. రెడ్డి అంటూ గ్రామాల్లో తిరుగుతున్నారు
  • అభివృద్ధిని చూసి ఓటేయాలి
  • చంద్రబాబు సీఎం అయితే సీమకు నీళ్లొస్తాయి

మిగతా రాజకీయ నాయకులతో పోల్చితే కాస్త భిన్నంగా మాట్లాడే నేతగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పేరుంది. ఎన్నికల సందర్భంగా ఆయన తన నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా పుట్లూరులో పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ ఎన్నికల్లో కొందరు జనాలు రెడ్డి... రెడ్డి అంటూ ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. కులం కూడు పెడుతుందా? మంచితనం ఉంటేనే ఏ రెడ్డి అయినా గెలిచేది. చీని చెట్లను నరికిన వారినే మీరు ఆదరిస్తారా? మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓట్లేయండి. చంద్రబాబునాయుడు సీఎం అయితేనే రాయలసీమకు నీళ్లొస్తాయి. తొడకొట్టి చెబుతున్నా, పుట్లూరు, యల్లనూరు మండలాలకు హెచ్చెల్సీ నీళ్లు తెప్పిస్తా" అంటూ జేసీ మాట్లాడారు.

jc diwakar reddy
Chandrababu
Telugudesam
Jagan
  • Loading...

More Telugu News