Aravind Kejriwal: ఏపీకి ప్రత్యేక హోదా కోసం పూర్తి సహకారం అందిస్తాం: కేజ్రీవాల్

  • దేశంలో ఎన్నో సమస్యలు సృష్టించారు
  • చంద్రబాబు మరోసారి సీఎం కావాలి
  • ఎన్నికలు ఏపీకి చాలా కీలకం

ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో కలిసి దేశంలో ఎన్నో సమస్యలు సృష్టించారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు. నేడు విశాఖలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మరోసారి సీఎం కావాలని ఆకాంక్షించారు. ఈ ఎన్నికలు దేశానికే కాకుండా, ఏపీకి కూడా చాలా కీలకమన్నారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమవంతు సంపూర్ణ సహకారం అందిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు.

మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే అమిత్‌షాతో కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారన్నారు. ప్రశాంతంగా ఉండే దేశంలో కుల, మతాల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టారని కేజ్రీవాల్ విమర్శించారు. నోట్ల రద్దుతో వ్యాపారాలు దెబ్బతిన్నాయని, వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. నోట్ల రద్దు పెద్ద కుంభకోణమని ఇప్పుడు తెలుస్తోందని, మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే హిట్లర్ పాలన వస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

Aravind Kejriwal
Chandrababu
Narendra Modi
Amith shah
Andhra Pradesh
  • Loading...

More Telugu News