Venkatesh: కుమార్తె పెళ్లి సంబరాలు ముగిశాయో లేదో ఉప్పల్‌లో ప్రత్యక్షమైన వెంకీ

  • మ్యాచ్‌లో బాగా సందడి చేసిన వెంకీ
  • ఎక్కడ మ్యాచ్ జరిగినా ప్రత్యక్షం
  • ఇవాళ కూడా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా వెంకీ

ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేశ్ అటు తన ఇంట్లో కుమార్తె పెళ్లి సంబరాలు ముగిశాయో లేదో, ఇటు ఉప్పల్‌లో ప్రత్యక్షమయ్యారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బాగా సందడి చేశారు.

స్వతహాగా క్రికెట్ ప్రియుడైన వెంకీ, సమయం దొరికితే మాత్రం మ్యాచ్ ఎక్కడ జరిగినా ప్రత్యక్షమవుతారు. ముఖ్యంగా ఆయన సన్ రైజర్స్‌కు గట్టి  మద్దతుదారు కావడంతో మ్యాచ్‌ను ఆద్యంతం ఎంజాయ్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ ఓటమి పాలవుతుంటే ఆనందంతో గంతులు వేశారు. మొత్తంగా మ్యాచ్‌కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా వెంకీ నిలిచారు.  

Venkatesh
Uppal
Sun Raisers
Rayal Challengers
Match
  • Loading...

More Telugu News