Telangana: ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల నాయకత్వమే రాబోతోంది: సీఎం కేసీఆర్

  • ఆ నాయకత్వంలో టీఆర్ఎస్ కీలకం కాబోతోంది
  • కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో దేశానికి ఒరిగిందేమీ లేదు
  • అన్ని ఎంపీ సీట్లలో గెలిపిస్తే  దేశ గమనాన్ని మారుస్తాం

ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల నాయకత్వమే రాబోతోందని, ఆ నాయకత్వంలో టీఆర్ఎస్ కీలకం కాబోతోందని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. వనపర్తిలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి పరిపాలన చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో దేశానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే భారతదేశ గమనాన్నే మారుస్తామని, మన వెనుక అనేక రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఉన్నారని, ఎన్నికల తెల్లారి ఎవరి జాతకాలు ఏంటో తేలతాయని అన్నారు. బంగారు తెలంగాణ ఏర్పాటుకు ‘మీ దీవెనలు కావాలి’ అని ప్రజలను కోరారు. 

Telangana
vanaparthi
cm
kcr
TRS
election
  • Loading...

More Telugu News