Revanth Reddy: టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించిన రేవంత్‌రెడ్డి

  • ప్రజల మనిషిని
  • ప్రజా సమస్యలపై పోరాడుతా
  • టీఆర్ఎస్‌ను గెలిపిస్తే వ్యాపారాలు చేసుకుంటారు

నేడు సీపీఐ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించిన మల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. తనను గెలిపిన్తే పార్లమెంటులో ప్రజా సమస్యలపై పోరాడుతానని, అదే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే వ్యాపారాలు చేసుకుంటారని ఎద్దేవా చేశారు.

తాను ప్రజల మనిషినని, తనకు సీపీఐ అందిస్తున్న సహకారం మరచిపోలేనిదన్నారు. ఇకపై సీపీఐ చేయబోయే ప్రతి పోరాటంలో తన వంతు పాత్ర ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ప్రశ్నించే సత్తా ఉన్న వారిని గెలిపించాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మోదీని గద్దె దించాలని పిలుపునిచ్చారు.

Revanth Reddy
Chada venkat Reddy
TRS
CPI
Narendra Modi
  • Loading...

More Telugu News