Anil Kumar: కేసీఆర్ ప్రజలనే కాకుండా మేనల్లుడు హరీశ్‌ని కూడా మోసం చేస్తున్నారు: గాలి అనిల్ కుమార్

  • ద్రోహులకు టికెట్లు, మంత్రి పదవులు ఇచ్చారు
  • టీఆర్ఎస్‌కు ఓటేయడమంటే బీజేపీకి వేయడమే
  • ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

తెలంగాణ కోసం పని చేసిన వ్యక్తులను మోసం చేసి, ద్రోహులకు సీఎం కేసీఆర్ టికెట్లు, మంత్రి పదవులు ఇచ్చారని మెదక్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీకి జీవం పోసిన మెదక్ ప్రజలే, ఇప్పుడు ఆ పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.

ప్రజలనే కాకుండా కేసీఆర్ తన మేనల్లుడు హరీశ్‌రావుని కూడా మోసం చేస్తున్నారని అనిల్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్‌కు ఓటేయడమంటే బీజేపీకి ఓటేయడమేనన్నారు. ఈ సారి ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తే రెండు లక్షల రుణమాఫీ చేయడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఆరు వేలు అకౌంట్లో వేస్తారని హామీ ఇచ్చారు.

Anil Kumar
KCR
Harish Rao
Medak
Rahul Gandhi
Congress
  • Loading...

More Telugu News