Andhra Pradesh: తేడా నాయకులంటే బాలకృష్ణ, నారా లోకేశ్ లే.. ఈ విషయం ఏపీ ప్రజలందరికీ తెలుసు!: వైసీపీ నేత తాడి శకుంతల

  • జగన్ ను విమర్శించేంత స్థాయి యామినికి లేదు
  • విజయమ్మ పెంపకంపై ఆమె మాట్లాడటం హాస్యాస్పదం
  • విజయవాడలో మీడియాతో వైసీపీ నేత

జగన్, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించేంత స్థాయి టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినికి లేదని వైసీపీ నేత తాడి శకుంతల వ్యాఖ్యానించారు. సాధినేని యామిని తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల జీతానికి పనిచేసే యామిని జగన్ కుటుంబం, విజయమ్మ పెంపకంపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శకుంతల మాట్లాడారు.

తేడా నేతలు అంటే  నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ అని రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసని శకుంతల చురకలు అంటించారు. ‘వైఎస్ కుటుంబాన్ని ప్రశ్నించే అర్హత మీకు లేదు. టీడీపీలో ఉన్న మీరంతా వలస పక్షులు. వైఎస్ జగన్ పెంపకంపై యామినీ మాడ్లాడటం హాస్యాస్పదం. నెల జీతానికి పనిచేసే యామినీ వైఎస్ కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం ఆమె తెలివి తక్కువతనానికి నిదర్శనం. తేడా నేతలు అంటే నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైఎస్ కుటుంబం ప్రజలతో ఎలా మమేకం అయిందో చరిత్ర చూసి తెలుసుకోవాలి’ అని హితవు పలికారు.

Andhra Pradesh
YSRCP
Telugudesam
yamini
Chandrababu
Nara Lokesh
  • Loading...

More Telugu News