Chandrababu: చంద్రబాబు క‌ృషిని ‘కియా’మార్కెటింగ్ హెడ్ ప్రశంసించిన విషయం గుర్తులేదా!: జగన్ కు కనకమేడల హితవు

  • ఏపీ ప్రభుత్వం అద్భుతంగా సహకరించింది
  • తెలివైన యువతకు చంద్రబాబు తోడుగా ఉన్నారు
  • అందుకే, ఏపీని ఎంచుకున్నామని మనోహర్ భట్ చెప్పలేదా?

ఏపీకి కియా మోటార్స్ సంస్థ రావడానికి కారణం ప్రధాని మోదీయే నని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఖండించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కియా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తమ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అద్భుతంగా సహకరించిందని, సీఎం నుంచి కింది స్థాయి యంత్రాంగం సహకరించడం వల్ల, అనుకున్న సమయం కన్నా ముందుగానే నిర్మాణం పూర్తయిందని చెప్పారు.

ఏపీలో తెలివైన విద్యావంతులైన యువత ఉన్నారని, వారికి తోడుగా పని చేసే ముఖ్యమంత్రి ఉన్నారని, అందుకే, తాము ఏపీని ఎంచుకున్నామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తమ సంస్థ ఏర్పాటుకు మొదటి ఛాయిస్ తమిళనాడు, రెండో ఛాయిస్ గా గుజరాత్, మూడో ఛాయిస్ కింద ఏపీలోని శ్రీ సిటీస్ సెజ్ అనుకున్నామని ఆయన చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

Chandrababu
KIA
Jagan
kanakamedala
  • Loading...

More Telugu News