Andhra Pradesh: ఈ విషయాన్ని‘కియా’ సీఈఓ ఎవరి చెవిలోనూ చెప్పలేదు!: జగన్ కు ఘాటు కౌంటరిచ్చిన కనకమేడల

  • చంద్రబాబు వల్లే ‘కియా’ ఏపీకి వచ్చింది
  • ఈ విషయం ‘కియా’  సీఈఓనే చెప్పారు
  • మోదీ వల్లే ‘కియా’ వచ్చిందన్న జగన్ పై ఫైర్

ఏపీకి కియా మోటార్స్ సంస్థ రావడానికి కారణం ప్రధాని మోదీయే నని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఖండించారు. అసలు, ఏపీకి కియా మోటార్స్ ఎలా వచ్చిందో విలేకరులకు ఈరోజు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పరిశ్రమ వారు  మొదట్లో తమిళనాడు, గుజరాత్, ఏపీలో పర్యటించారని చెప్పారు. ఆ పర్యటన తర్వాత కియా మోటార్స్ సీఈఓ ఏం చెప్పారంటే, ఏపీలో కియా పరిశ్రమ ఏర్పాటు చేయడం నమ్మలేని అద్భుత ప్రయాణంలా నడిచిందని, ఎంఓయూ పై సంతకాలు చేసిన దగ్గర నుంచి అత్యంత వేగంగా మౌలిక సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం కల్పించారని, చంద్రబాబు మద్దతు లేకుంటే ఈ ప్రాజెక్టు సాధ్యమయ్యేది కాదని, ఇంత తక్కువ సమయంలో ఇవన్నీ చేసిన చంద్రబాబుకు, ఆయన బృందానికి కృతఙ్ఞతలు అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కియా మోటార్స్ సీఈవో విలేకరుల సమావేశంలోనే చెప్పారు తప్ప, ఎవరి చెవిలోనూ చెప్పలేదంటూ ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Andhra Pradesh
anathapuram
KIA
jagan
YSRCP
Telugudesam
mp
kanakamedela
ravindra
  • Loading...

More Telugu News