Nellore District: గూడూరు ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు అంగుళం కూడా కదల్లేదు: వైఎస్ జగన్

  • చట్టంలో దుగరాజపట్నం పోర్టు నిర్మించాలని ఉంది
  • కృష్ణపట్నం పోర్టు చాలని చెప్పడానికి బాబు ఎవరు?
  • చంద్రబాబు పాలనలో ప్రతి అడుగూ మోసమే 

గూడూరు-1, గూడూరు-2లను కలిపే ఫ్లై ఓవర్ నిర్మాణపు పనులు అంగుళం కూడా కదల్లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. నెల్లూరు జిల్లా గూడూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో దుగరాజపట్నం పోర్టు నిర్మించాలని ఉన్నా, కృష్ణపట్నం పోర్టు చాలని చెప్పడానికి చంద్రబాబు ఎవరు? అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ప్రతి అడుగులోనూ మోసమేనని ఆరోపించారు. కండలేరు జలాశయం కోసం రూ.63 కోట్లు వెచ్చించి నీళ్లిచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదని, ఆ పథకం సరిగా నడపలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ప్రజలు చెప్పారని అన్నారు. తన పాదయాత్రలో ప్రజలందరి కష్టాలు చూశాను, విన్నాను అని అన్నారు. ‘అందరికీ చెబుతున్నా, నేను ఉన్నాననే భరోసా ఇస్తున్నా’ అని చెప్పారు. 

Nellore District
Gudur
YSRCP
ys jagan
  • Loading...

More Telugu News