India: మరికొన్ని గంటల్లోనే.. ఆధార్ తో పాన్ అనుసంధానానికి ముగియనున్న గడువు!

  • నేటితో లింకింగ్ గడువు ముగింపు
  • ఐటీ రిటర్నుల దాఖలుకు అనుసంధానం తప్పనిసరి
  • ఐటీ శాఖ ఉన్నతాధికారి వ్యాఖ్య

పాన్ కార్డును ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసుకోవడానికి నేటితో గడువు ముగియనుందని ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  ఐటీ రిటర్నులు దాఖలు చేయాలంటే ఆధార్-పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరని చెప్పారు. 2019-20 సంవత్సరానికి ఐటీ రిటర్నులు ఫైల్‌ చేయాలంటే తప్పకుండా అనుసంధానం చేసుకోవాలని  సూచించారు. ప్రధానంగా నాలుగు పద్ధతుల్లో ఈ అనుసంధాన ప్రక్రియను చేపట్టవచ్చని పేర్కొన్నారు.

1. ఆదాయపన్ను శాఖ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ సాయంతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లో ‘ఆధార్ లింక్’ విభాగంలో ఇది లభిస్తుంది.

2.ఐటీశాఖ ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని కూడా కల్పించింది. అవసరమైన వారు 567678 లేదా 56161 నంబర్ కు UIDPAN<12-digit Aadhaar><10-digit PAN>. అని మెసేజ్‌ పెట్టాలి.

3.ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్నులు  దాఖలుచేసే సమయంలో ఆధార్‌ సంఖ్యను పాన్‌ సంఖ్యతో అనుసంధానించాలని కోరవచ్చు. ఎన్‌ఎస్‌డీఎల్‌, యూటీఐఐటీఎస్‌ఎల్‌ వెబ్ సైట్లలో లభిస్తుంది.

4. పాన్‌ కార్డు దరఖాస్తు సమయంలో కానీ, పాన్‌కార్డులో మార్పులకు దరఖాస్తు సమయంలో మనం ఆధార్‌ అనుసంధానాన్ని కోరవచ్చు.

India
aadhaar
it department
pan
business
  • Loading...

More Telugu News