YS Vijayamma: షర్మిల బస్సు యాత్రలో దొంగల హల్‌చల్.. షర్మిళ ఉంగరం చోరీకి విఫలయత్నం

  • మంగళగిరి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన షర్మిల 
  • కార్యకర్తల ఉత్సాహం చూసి షేక్‌హ్యాండ్ 
  • చేతులు కలిపి ఉంగరం కాజేయాలని చూసిన దొంగ

ఎన్నికల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ పార్టీలు రోడ్డు షోలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. సభల కోసం ఆయా పార్టీలు భారీగా జనసమీకరణ చేస్తున్నాయి. సరిగ్గా దీనినే ఆసరాగా తీసుకుంటున్న చోరులు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుని పరారవుతున్నారు. అయితే, ఏకంగా వైసీపీ చీఫ్ జగన్ సోదరి షర్మిల చేతి ఉంగారాన్నే కాజేసేందుకు ప్రయత్నించాడో దొంగ. వీడియోకు చిక్కిన ఈ ఘటన తెగ వైరల్ అవుతోంది.

శనివారం షర్మిల మంగళగిరి నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. రోడ్డు పక్కన కిక్కిరిసిన వైసీపీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ, చేతులు కలుపుతూ ముందుకు సాగారు. ఆమెతో చేతులు కలిపేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. దీంతో షర్మిల కూడా కొంత ఉత్సాహంగా వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉత్సాహం నింపారు. ఇదే అదునుగా భావించిన ఓ వ్యక్తి షర్మిలకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఆమె వేలికి ఉన్న ఉంగరాన్ని కొట్టేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన షర్మిల చేయిని గట్టిగా విదిలించుకున్నారు. ఉంగరం వేలికి కాస్తా బిగుతుగా ఉండడంతో ఆ దొంగ ప్రయత్నం ఫలించలేదు. లేదంటే కొట్టేసేవాడే.

YS Vijayamma
YS Sharmila
mangalagiri
Bus tour
Andhra Pradesh
ring
  • Loading...

More Telugu News