Bihar: అధికారులతో అనుచితంగా ప్రవర్తించిన కేంద్ర మంత్రి... వీడియో!
- బీహార్ లోని బుక్సర్ లో ఘటన
- నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన అశ్విని కుమార్ చౌబే
- వాహనాలు ఆపారంటూ ఆగ్రహం
తన కాన్వాయ్ ని ఆపారన్న కోపంతో అధికారులపై నిప్పులు చెరుగుతూ, అనుచితంగా ప్రవర్తించారు కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే. ఈ ఘటన బీహార్ లోని బుక్సర్ లో చోటు చేసుకుంది. భారీ కాన్వాయ్ తో ఆయన వెళుడుండగా, ఆ ప్రాంతంలో ఎన్నికల తనిఖీల్లో ఉన్న కేకే ఉపాధ్యాయ్ అనే అధికారి, వాహనాన్ని ఆపారు. దీంతో అశ్విని కుమార్ చౌబేకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. "నేనెవరో తెలియదా?" అంటూ ఆయన అధికారిపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఇన్ని వాహనాలను అనుమతించేది లేదని, అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిందేనని ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. తన కాన్వాయ్ ని తనిఖీలు చేయకుండా వెళ్లనివ్వాల్సిందేనని ఉపాధ్యాయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత నెలకొంది.

#WATCH Union Minister Ashwini Kumar Choubey misbehaves with SDM KK Upadhyay in Buxar after the official had stopped his convoy for violating model code of conduct. #Bihar (30.3.19) pic.twitter.com/G7Fp96zOug
— ANI (@ANI) March 31, 2019