Congress: రంగంలోకి రాహుల్.. నేడు విజయవాడకు కాంగ్రెస్ చీఫ్

  • ఉదయం 10:45 గంటలకు విజయవాడకు రాహుల్
  • బహిరంగ సభ అనంతరం కళ్యాణదుర్గం వెళ్లనున్న కాంగ్రెస్ చీఫ్
  • రాహుల్ రాక ఏపీ కాంగ్రెస్‌లో జోష్ పెంచుతుందని ఆశ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడ, కళ్యాణదుర్గం సభల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఎన్నికలు దగ్గరపడుతున్నా ఏపీలో బరిలో ఉన్న కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లలేకపోతున్నారు. అసలు వారు పోటీలో ఉన్నారో, లేరో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాహుల్ రాక కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాన్ని పెంచుతుందని చెబుతున్నారు.

ఈ ఉదయం 10:45 గంటలకు విజయవాడ చేరుకోనున్న రాహుల్.. తొలుత రాష్ట్రస్థాయి బూత్ కమిటీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. కేంద్రంలో కాంగ్రెస్ ఎందుకు రావాల్సిన అవసరం ఉందో వారికి వివరిస్తారు. అలాగే రైతు రుణమాఫీ, కనీస ఆదాయ పథకంపై వారికి దిశానిర్దేశం చేస్తారు. అనంతరం 11:30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 11:40 నుంచి 12:20 వరకు రాహుల్ ప్రసంగిస్తారు. అనంతరం 12:45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి కళ్యాణదుర్గం వెళ్తారు.

Congress
Rahul Gandhi
Andhra Pradesh
Vijayawada
kalyanadurgam
  • Loading...

More Telugu News