AS Dulat: పుల్వామా దాడి ఎన్నికలకు ముందు బీజేపీకి లభించిన బహుమతి: 'రా' మాజీ చీఫ్
- లక్షిత దాడులు కూడా బీజేపీకి లాభమే
- ఏదో జరగాలని ప్రజలు కోరుకున్నారు
- జాతీయవాదభావం పెరిగితే ప్రమాదమే
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి, ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి లభించిన ఓ బహుమతి వంటిదని రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) మాజీ చీఫ్ ఏఎస్ దులాత్ వ్యాఖ్యానించారు. ఆసియన్ అరబ్ అవార్డ్స్ 2019 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పాక్ పై లక్షిత దాడులు చేయడం కూడా ఆ పార్టీకి లాభించే అంశమేనని ఆయన అభిప్రాయపడ్డారు. "నా అభిప్రాయంలో బీజేపీ లేదా మోదీకి ఇదో బహుమతివంటిది. ఎందుకంటే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి. ఈ దాడి తరువాత ఏదో జరుగుతుందని, జరగాలని ప్రజలు కోరుకున్నారు" అని ఆయన అన్నారు. జాతీయవాదభావం ఏ మేరకు ఉండాలో అంతే ఉండాలని ఆయన అన్నారు. మరీ పెరిగిపోతే అది యుద్ధానికి దారితీస్తుందని దులాత్ అభిప్రాయపడ్డారు. ఈ జాతీయవాద భావమే ప్రపంచాన్ని అనిశ్చితికి గురి చేస్తుందని ఆయన అన్నారు.