Ambika Krishna: ఎంత మంది తారలు దిగొచ్చినా ఫలితం మారదు: నిర్మాత అంబికా కృష్ణ

  • ఏపీ ఓటర్లు విజ్ఞతగలవారు
  • తామనుకున్న వారికే ఓటేస్తారు
  • తారలు ఓట్లు కురిపించే చాన్స్ తక్కువే

సినిమా నటీ నటులు ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా, ప్రజలు వారు ఓటు వేయాలనుకున్న వారికి మాత్రమే ఓటేస్తారే తప్ప, ఫలితం మారే చాన్స్ లేదని నిర్మాత అంబికా కృష్ణ అభిప్రాయపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వారని, వారు సినిమాలను, రాజకీయాలను వేర్వేరుగా చూస్తున్నారని చెప్పారు. స్టార్ క్యాంపెయిన్ ఎన్నికల ఫలితాలను మార్చలేదని స్పష్టం చేశారు. అభ్యర్థుల తరఫున సినిమా తారలు ప్రచారానికి వస్తే, వారిని చూసేందుకు వచ్చే ప్రజలు, అతనికే ఓటు వేస్తారని భావించరాదని చెప్పారు. తమ గ్లామర్ తో ప్రేక్షకులను కట్టి పడేసే స్టార్స్, తమ మాటలతో ఓట్లను కురిపించే అవకాశాలు బహు స్వల్పమని పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News