priyanka chopra: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా-నిక్ వివాహం మూణ్ణాళ్ల ముచ్చటేనా?.. విడాకులంటూ సంచలన వార్తలు!

  • ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయంటూ కథనం
  • చీటికీ మాటికీ గొడవ
  • విడాకులు తీసుకోవాలంటూ నిక్ కుటుంబ సభ్యుల ఒత్తిడి

బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా- అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ గతేడాది డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జోధ్‌పూర్‌లో వైభవంగా జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లై పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే వీరిద్దరూ విడాకులకు సిద్ధమవుతున్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది.

ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడడం లేదని, ప్రతీ విషయానికి గొడవ పడుతున్నారని ఆ కథనంలో పేర్కొంది. తొందరపడి ఒక్కటైన వీరిద్దరూ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారంటూ రాసిన కథనం బాలీవుడ్‌లో చర్చకు కారణమైంది. పెళ్లి తర్వాత ప్రియాంక స్వభావం మారుతుందని, సహజ ధోరణికి వస్తుందని నిక్ భావించాడని, కానీ ఆమె ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో నిక్ ఆవేదన చెందుతున్నాడని పేర్కొంది.

ప్రియాంకకు కోపం ఎక్కువని, కానీ ఆ సంగతి నిక్‌కు తెలియదని పేర్కొంది. ఇద్దరి పరిస్థితిని గమనించిన నిక్ కుటుంబ సభ్యులు విడాకుల కోసం సూచిస్తున్నట్టు ఆ కథనం తెలిపింది. ప్రియాంకలో ఇసుమంతైనా పరిపక్వత లేదని, ఆమె ఇంకా 21 ఏళ్ల అమ్మాయిలానే ప్రవర్తిస్తోందని నిక్ కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నట్టు వివరించింది. అయితే, ఈ వార్తలను ప్రియాంక ప్రతినిధి ఖండించారు. ఆ వార్తలు ఊహాజనితమేనని, వాస్తవం లేదని తేల్చి చెప్పారు.

priyanka chopra
nick jonas
Bollywood
Hollywood
marriage
  • Loading...

More Telugu News