raghurama krishnam raju: మద్య నిషేధం అమలు చేస్తామని తాగి చెప్పాలా?.. వైసీపీ నేత రఘురామకృష్ణం రాజుపై జనసేన ఫైర్

  • తాగి ప్రచారం చేస్తున్నారంటూ జనసేన ఎద్దేవా
  • జగన్ తెచ్చే నవరత్నాలు ఇవేనా? అంటూ సూటి ప్రశ్న
  • వైరల్ అవుతున్న రామకృష్ణం రాజు ప్రసంగం వీడియో

వైసీపీ నేత రఘురామకృష్ణం రాజు తాగి ప్రచారం చేస్తున్నారంటూ జనసేన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. వైసీపీ అధికారంలోకి వస్తే జగన్‌ వెంటనే మద్య నిషేధం అమలు చేస్తారని హామీ ఇస్తున్న రఘురామకృష్ణం రాజును చూస్తుంటే తాగి మాట్లాడుతున్నట్టు సులభంగా తెలిసిపోతోంది. సరిగా నిలబడలేకపోతున్న ఆయన మాట్లాడడానికి కూడా ఎంతో కష్టపడుతుండడం వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. నర్సాపూర్‌ లోక్‌సభ బరిలో ఉన్న ఆయన ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఇలా కెమెరాకు దొరికిపోయారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన జనసేన.. మద్యం నిషేధం చేస్తామని తాగి మరీ చెప్పాలా? అని ఎద్దేవా చేసింది. మీరు తీసుకొచ్చే ‘నవరత్నాలు’ ఇవేనా? అంటూ జగన్‌ను ప్రశ్నించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై అటు వైసీపీ కానీ, ఇటు రఘురామకృష్ణం రాజు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
 

  • Error fetching data: Network response was not ok

More Telugu News