kumar viswajit: కుమార్ విశ్వజిత్‌ను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం

  • వైసీపీ నేతల ఫిర్యాదుతో వెంకటేశ్వరరావు బదిలీ
  • ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు
  • ఆయన స్థానంలో కుమార్ విశ్వజిత్

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, సహా మరికొందరు పోలీసు ఉన్నతాధికారులను ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వీరందరూ ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా, బదిలీ అయిన వెంకటేశ్వరరావు స్థానంలో ఏపీ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల జారీ చేసింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన విశ్వజిత్ ప్రస్తుతం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా ఉన్నారు.

kumar viswajit
Andhra Pradesh
Inttelligent DG
CEC
YSRCP
  • Loading...

More Telugu News