Sushma Swaraj: జర్మనీలో భారత జంటపై దాడి.. భర్త మృతి, గాయాలతో బయటపడిన భార్య

  • కత్తితో దాడి చేసిన ఓ ఇమ్మిగ్రెంట్
  • పిల్లలకు రక్షణ కల్పించాలని ఆదేశం
  • ప్రశాంత్ కుటుంబ సభ్యులకు సానుభూతి

జర్మనీలో భారతీయ జంటపై దాడి జరిగింది. ఈ దాడిలో భర్త చనిపోగా, భార్య గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా వివరించారు. మ్యూనిచ్ పట్టణంలో ప్రశాంత్, స్మిత బసరూర్ జంటపై ఓ ఇమ్మిగ్రెంట్ కత్తితో దాడి చేశాడు.

ఈ ఘటనలో ప్రశాంత్ చనిపోగా, స్మిత గాయాలపాలయ్యారు. దీంతో వీరి పిల్లలకు రక్షణ కల్పించాలని మ్యూనిచ్‌లోని భారత దౌత్య అధికారులను ఆదేశించినట్టు సుష్మ వెల్లడించారు. ప్రశాంత్ సోదరుడిని వెంటనే జర్మీనీకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులకు సుష్మ సానుభూతి తెలిపారు.

Sushma Swaraj
Prashanth
Smitha Basaroor
Munich
Germany
  • Loading...

More Telugu News