GVL Narasimha Rao: వందల కోట్లు కొట్టేసి, ఆ డబ్బుతో గెలవాలని చూస్తున్నారు: టీడీపీపై జీవీఎల్ ఫైర్

  • కాంగ్రెస్‌కి పట్టిన గతే, టీడీపీకీ పడుతుంది
  • రియల్ ఎస్టేట్ కేంద్రంగా మార్చేశారు
  • టీడీపీ యాడ్స్ అన్నీ కేంద్ర పథకాలు

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కి పట్టిన గతే, ఇప్పుడు టీడీపీకి పడుతుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వందల కోట్ల సొమ్ము కొట్టేసి ఆ అవినీతి డబ్బుతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. బయటి వ్యక్తి గుంటూరు ఎంపీగా ఉండబట్టే అక్కడ అభివృద్ధి జరగలేదన్నారు.

రియల్ ఎస్టేట్ కేంద్రంగా అమరావతిని మార్చేశారని జీవీఎల్ విమర్శించారు. కేంద్ర పథకాలన్నీ టీడీపీ తన యాడ్స్‌గా టీవీల్లో ఇస్తోందని, అందుకే చంద్రబాబుకు స్టిక్కర్ బాబు అనే ముద్ర పడిందన్నారు. ఏప్రిల్ నెలలో బీజేపీ అగ్రనేతలు ఏపీకి రానున్నారని జీవీఎల్ తెలిపారు. ఏప్రిల్ 1న మోదీ, 4న అమిత్ షా, 5న యోగి ఆదిత్యనాథ్, 10న నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.

GVL Narasimha Rao
Chandrababu
Narendra Modi
Yogi Adityanath
Amith Shah
Nirmala Sitharaman
  • Loading...

More Telugu News