Sai Prathap: టీడీపీకి బై చెప్పిన చిత్తూరు సీనియర్ నేత.. వైసీపీలో చేరిక

  • ఊపందుకున్న జంపింగ్‌లు
  • వైసీపీలో చేరేందుకు సిద్ధమైన నేతలు
  • టీడీపీకి గుడ్‌బై చెప్పిన శ్రీరామ్మూర్తి

ఎన్నికలు సమీపిస్తున్నా కూడా ఇంకా నేతలు పక్క చూపులు చూస్తూనే ఉన్నారు. కాస్త ఆగాయనుకున్న జంపింగ్‌లు నేడు మళ్లీ ఊపందుకున్నాయి. నేడు కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్, ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. రేపో, మాపో వైసీపీ కండువా కప్పుకునేందు సిద్ధమవుతున్నారు.

తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, శ్రీకాకుళం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ శ్రీరామ్మూర్తి కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. అనుకున్నదే తడవుగా ఆయన వెంటనే తన అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

Sai Prathap
Mani Gandhi
Srirammurthy
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News