crpf: కశ్మీర్లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పక్కన పేలిపోయిన కారు

  • జమ్ముకశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో పేలుడు
  • దెబ్బతిన్న సీఆర్పీఎఫ్ కు చెందిన వాహనం
  • కాన్వాయ్ లో మొత్తం 10 వాహనాలు

జమ్ముకశ్మీర్ లో మరో పేలుడు ఘటన సంభవించింది. రాంబన్ జిల్లా బనిహాల్ పట్టణంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పక్కన ఓ కారు పేలిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో... అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... హ్యుండాయ్ శాంత్రో కారు పేలుడుకు గురైంది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఓ సీఆర్పీఎఫ్ వాహనానికి వెనుకవైపు డ్యామేజ్ అయింది. పేలుడు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు, కారులో కొన్ని రసాయనాలు, పేలుడు పదార్థాలు, ఎల్పీజీ సిలిండర్లు ఉన్నట్టు సమాచారం. సీఆర్పీఎస్ కాన్వాయ్ లో 10 వాహనాలు ఉన్నాయి.

crpf
convoy
car blast
Jammu And Kashmir
  • Loading...

More Telugu News