sharmila: షర్మిల ప్రచారానికి తప్ప పోటీకి పనికిరారా?: అనురాధ

  • 2014 ఎన్నికల మాదిరే ఇప్పుడు కూడా నాటకానికి తెరతీశారు
  • విజయమ్మ, షర్మిల ఇప్పుడే ప్రచారానికి ఎందుకొచ్చారు?
  • ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు ఎందుకెళ్తున్నారో వివరించాలి

వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల తరహాలోనే ఇప్పుడు కూడా వైసీపీ అదే నాటకానికి తెరతీసిందని విమర్శించారు. ఇన్ని రోజులు కనిపించని జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఇప్పుడే ప్రచారానికి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ప్రచారానికి తప్ప పోటీకి షర్మిల పనికిరారా? అని అడిగారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీ, కేసీఆర్ లను వైసీపీ నేతలు ఒక్క మాట కూడా అనడం లేదని దుయ్యబట్టారు. ముసుగు తొలగించి మాట్లాడాలని సూచించారు. మంగళగిరి, చిత్తూరు, విశాఖపట్టణం, గన్నవరం వెళ్లి చూస్తే రాష్ట్రానికి ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయో తెలుస్తుందని అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు జగన్ ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

sharmila
vijayamma
jagan
panchumathi
anuradha
  • Loading...

More Telugu News