amit shah: భార్య, కుమారుడితో కలసి వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన అమిత్ షా
- గాంధీనగర్ లో నామినేషన్ వేసిన అమిత్ షా
- వెంట వచ్చిన జైట్లీ, రాజ్ నాథ్, ఉద్ధవ్ థాకరే
- అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించిన షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ గాంధీనగర్ లో తన భార్య, కుమారుడితో కలసి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఉన్నారు. నామినేషన్ కు ముందు ఆయన భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సభకు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, రామ్ విలాస్ పాశ్వాన్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, వాజ్ పేయి, అద్వానీలాంటి గొప్ప నేతలు ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ నుంచి పోటీ చేస్తుండటం గర్వంగా ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని యావత్ దేశం కోరుకుంటోందని చెప్పారు. గాంధీనగర్ నుంచి అద్వానీ ఆరు సార్లు ఎంపీగా గెలుపొందారు.