India: భారత్ ఏశాట్ ప్రయోగంపై మేం నిఘా వేయలేదు: అమెరికా స్పష్టీకరణ

  • ఈ ప్రయోగం గురించి ముందే తెలుసు
  • భారత్ మా భాగస్వామి
  • సంబంధాలు బలోపేతం చేసుకుంటాం

నిన్నమొన్నటివరకు మూడు దేశాలకు మాత్రమే సాధ్యమైన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు భారత్ కూడా సముపార్జించింది. కొన్నిరోజుల క్రితం భారత్ తన స్వదేశీ తయారీ ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. దాంతో ఈ సాంకేతికతను అందిపుచ్చుకున్న నాలుగోదేశంగా అవతరించింది. ఏశాట్ గా పిలుచుకునే ఈ క్షిపణిని ప్రయోగించిన అనంతరం బంగాళాఖాతంపైకి అమెరికా నిఘా విమానం కోబ్రా బాల్ వచ్చి వెళ్లినట్టు వార్తలొచ్చాయి. భారత ఏశాట్ ప్రయోగం డేటా సేకరించడానికి ఆ విమానం వచ్చి ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, భారత ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగంపై తాము నిఘా వేయలేదని అమెరికా వర్గాలు స్పష్టం చేశాయి.

దీనిపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ స్పందించింది. భారత్ తమకు భాగస్వామి అని, భారత్ తో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది. వాస్తవానికి, భారత్ ఏశాట్ ప్రయోగం చేపడుతుందన్న విషయం తమకు ముందే తెలుసని పెంటగాన్ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ డేవిడ్ ఈస్ట్ బార్న్ తెలిపారు. కోబ్రాబాల్ విమానం నిఘా వేసిందన్న వార్తలు నిరాధారం అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News