Andhra Pradesh: జగన్ ఒక్కడే కాదు.. ఫ్యామిలీ మొత్తం తేడానే!: టీడీపీ నేత సాధినేని యామిని

  • మా పిల్లలను జైలు పాలు చేసుకోవాలా?
  • పులికాట్ పక్షుల్లా వైఎస్ కుటుంబం ప్రచారానికి వస్తోంది
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ అప్పనంగా తన చేతిలోకి వచ్చేసిందని జగన్ కలలు కంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు. జగన్ కు ఒక్క అవకాశం ఇచ్చి మా పిల్లలను జైలు పాలు చేసుకోమంటారా? అని విజయమ్మను ఆమె ప్రశ్నించారు. ఏపీలో అవినీతి తాండవం చేయాలని కోరుకుంటున్నారా? అని నిలదీశారు. జగన్ కుటుంబం మొత్తం తేడానేనని దుయ్యబట్టారు.

అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యామిని మాట్లాడుతూ..‘‘కొన్ని వలస పక్షులను పులికాట్ సరస్సు వద్ద చూస్తుంటాం. నిర్ణీతమైన సమయంలోనే అవి అక్కడకు వచ్చి, తిరిగి వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉన్నారు.

మామూలుగా కుటుంబంలో ఒకరో ఇద్దరో తేడా అనుకున్నాం. కానీ కుటుంబం మొత్తం మానసిక పరమైన తేడాను ఎదుర్కొంటున్నారు. మొన్న షర్మిల వచ్చి ఏదో మాట్లాడారు. నిన్న తల్లి విజయలక్ష్మిగారిని దింపారు. ఆవిడ ఒక చేతిలో బైబిల్ పట్టుకుని.. మరో చేతిలో మైక్ పట్టుకుని చెబుతూ ఉంటారు. ‘నా కొడుక్కి ఒక ఛాన్స్ ఇవ్వండి’ అని చెబుతున్నారు. మీ బిడ్డకు ఛాన్స్ ఇచ్చి మా పిల్లలను రోడ్డుపై పడేయాలా? జైలు పాలు చేయాలా?’ అని యామిని నిప్పులు చెరిగారు.

Andhra Pradesh
Jagan
YSRCP
YS Vijayamma
sadineni yamini
Telugudesam
  • Loading...

More Telugu News