Guntur: రాజన్న బిడ్డకు ఒక్క అవకాశమివ్వండి: వైఎస్ షర్మిళ

  • చంద్రబాబులా రాజకీయ వ్యభిచారం చేయట్లేదు
  • ఓటు వేసే ముందు వైఎస్ఆర్ ని గుర్తుచేసుకోవాలి
  • ‘నేను ఉన్నాను’ అని అంటున్న జగన్ కు అవకాశమివ్వండి

ఈ ఎన్నికల్లో రాజన్న బిడ్డను ఒక్కసారి గెలిపించండి, జగన్ ని సీఎం చేయండి అంటూ వైసీపీ నేత వైఎస్ షర్మిళ ప్రజలను కోరారు. గుంటూరులోని మాయాబజార్ సెంటర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే, జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఓటు వేసే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓసారి గుర్తుచేసుకోవాలని షర్మిళ సూచించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆమె విమర్శలు గుప్పించారు. అవతల పార్టీలో గెలుపొందిన వారిని తమ పార్టీలోకి చంద్రబాబు లాక్కున్నారని, ఇలాంటి రాజకీయ వ్యభిచారం జగన్ చేయలేదని, రాజకీయ విలువలకు ఆయన కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు. ప్రజలకు తాను ఉన్నానని భరోసా ఇస్తున్న రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వకూడదా? ప్రజలకు ఇచ్చిన మాట తప్పని వాడు కావాలంటే, మడమ తిప్పని వాడు కావాలంటే జగన్ రావాలని కోరారు.

Guntur
YSRCP
sharmila
mustafa
jagan
  • Loading...

More Telugu News