shatrughan sinha: శత్రుఘ్న సిన్హా బీజేపీని వీడటంపై ఆయన కుమార్తె సోనాక్షి స్పందన

  • అప్పట్లో బీజేపీలో నాన్నకు ఎంతో గౌరవం ఉండేది
  • బీజేపీని వీడటంలో ఆలస్యం చేశారు
  • ఎప్పుడో ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సింది

తన తండ్రి శత్రుఘ్న సిన్హా బీజేపీని వీడటంపై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్పందించింది. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది అని వ్యాఖ్యానించింది. బీజేపీ ప్రారంభం నుంచి జేపీ నారాయణ్, వాజ్ పేయి, అద్వానీలతో పాటు పార్టీలో తన తండ్రికి ఎంతో గౌరవం ఉండేదని చెప్పింది. వీరందరికీ ఇప్పుడు ఆ స్థాయిలో గౌరవం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బీజేపీని వీడటంతో తన తండ్రి కొంత ఆలస్యం చేశారని... ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని తెలిపింది.

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విధానాలను ఆ పార్టీ ఎంపీగా ఉన్న శత్రుఘ్న సిన్హా ఎన్నోసార్లు బహిరంగంగానే విమర్శించారు. గత గురువారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిసిన అనంతరం... బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్టు ఆయన ప్రకటించారు. పదేళ్లుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్నా సాహిబ్ నియోజకవర్గ అభ్యర్థిగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను బీజేపీ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఆయన బీజేపీని వీడారు. ఎంతో బాధతో బీజేపీని వీడుతున్నానని చెప్పారు.

shatrughan sinha
Sonakshi Sinha
bollywood
bjp
congress
  • Loading...

More Telugu News