chandrababu: ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన చంద్రబాబు.. కొందరు నేతలకు తీవ్ర హెచ్చరికలు

  • ప్రచారానికి ఒక పూట విరామమిచ్చిన చంద్రబాబు
  • పార్టీ వ్యవహారాలపై సమీక్ష
  • ఓడిపోతే సామాన్య కార్యకర్తలుగా మిగిలిపోతారంటూ కొందరు నేతలకు హెచ్చరిక

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పూట ఎన్నికల ప్రచారానికి విరామమిచ్చారు. తన నివాసంలోనే ఉన్నారు. ఇదే సమయంలో ఆయన పూర్తిగా పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి, ప్రచారశైలిని ఆయన సమీక్షించారు. ఇదే సమయంలో కొంత మంది నేతలతో కూడా మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోతే నియోజకవర్గ ఇన్ ఛార్జులుగా కూడా అవకాశం ఇవ్వనని... సామాన్య కార్యకర్తలుగా ఐదేళ్లపాటు ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. మధ్యాహ్నం తర్వాత ఆయన శ్రీకాకుళం జిల్లాకు పయనమవుతారు. అక్కడ ప్రచారంలో పాల్గొని, రాత్రికి అక్కడే బస చేస్తారు. 

chandrababu
campaign
Telugudesam
  • Loading...

More Telugu News