nithin: మళ్లీ ఆ దర్శకుడికే నితిన్ ఛాన్స్ ఇచ్చాడు

  • సెట్స్ పైకి వెళ్లనున్న 'భీష్మ'
  • తదుపరి సినిమా చంద్రశేఖర్ యేలేటితో
  • సొంత బ్యానర్లో మరో మూవీ

యూత్ లో నితిన్ కి మంచి క్రేజ్ వుంది. పరాజయాలు పలకరిస్తున్నా, తన క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి తనవంతు కృషి చేస్తూనే వున్నాడు. తన తాజా చిత్రాన్ని దర్శకుడు వెంకీ కుడుములతో చేయనున్నట్టు ఆయన కొన్ని రోజుల క్రితమే ప్రకటించాడు. అంతేకాదు తన పుట్టినరోజు నాటికి మరో రెండు సినిమాలు ప్రకటిస్తానని కూడా కొన్ని రోజుల క్రితమే చెప్పాడు.

అన్నట్టుగానే .. చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా చేయనున్నట్టుగా ఇటీవలే ప్రకటించాడు. ఈ రోజున నితిన్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మరో ప్రాజెక్టును గురించి ప్రకటించాడు. ఇంతకుముందు తనతో 'ఛల్ మోహన్ రంగా' చేసిన కృష్ణచైతన్యకే ఆయన ఛాన్స్ ఇచ్చాడు. తనకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మరో అవకాశం ఇవ్వడం నితిన్ గొప్పతనమేనని చెప్పాలి. నితిన్ సొంత బ్యానర్లోనే ఈ సినిమా నిర్మితం కానుంది. నితిన్ ప్రకటించిన ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే రానున్నాయని అంటున్నారు.

nithin
venky kudumula
chandrasekhar yeleti
  • Loading...

More Telugu News