Nizamabad District: నిజామాబాద్ రైతు అభ్యర్థులకు కూరగాయల గుర్తులు!

  • నిజామాబాద్ బరిలో 178 మంది రైతులు
  • గుర్తులు కేటాయింపులో ఈసీకి తలనొప్పి
  • కూరగాయల నుంచి పురాతన వస్తువుల వరకు దేన్నీ వదలని ఎన్నికల అధికారులు

నిజామాబాద్‌లో టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితపై పోటీకి దిగిన రైతులకు విచిత్రంగా కాయగూరల గుర్తులను ఈసీ కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి కాకతాళీయమో, ఉద్దేశపూర్వకమో కానీ, కూరగాయలను ఎన్నికల గుర్తులుగా మార్చేసి ఆయా రైతులకు కేటాయించింది.

ఈ ఎన్నికల్లో 178 మంది రైతులు బరిలో ఉన్నారు. ఇంతమందికి గుర్తులు కేటాయించడం కత్తిమీద సామే. అన్ని గుర్తులను ఎక్కడి నుంచి తేవాలని తలలుపట్టుకున్న ఈసీకి కూరగాయలు, పండ్లు కనిపించాయి. అంతే.. ఒక్కో కూరగాయను ఒక్కో అభ్యర్థికి కేటాయించింది.

 పాతకాలం నాటి కల్వం (చిన్నసైజు రోలు), రోకలి, ఇసుర్రాయి వంటి వాటిని కూడా గుర్తులుగా కేటాయించి పాతకాలం నాటి చెరిగిపోయిన జ్ఞాపకాలను ఈసీ మరోమారు గుర్తు చేసింది. అలాగే, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు, వంటపాత్రలను కూడా ఎన్నికల అధికారులు వదల్లేదు.

ఇక, కూరగాయలు, పండ్ల విషయానికి వస్తే బెండకాయ, క్యాబేజీ, అల్లం, పచ్చిమిర్చి, బెంగళూరు మిర్చి, నూడుల్స్, చాక్లెట్స్, పళ్లెం, ద్రాక్ష గుత్తి, సెల్‌ఫోన్ చార్జర్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ మౌస్, బిస్కెట్లు, ఐస్ క్రీం, కేకు, బఠానీలు, వాటర్ హీటర్, స్విచ్ బోర్డు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

Nizamabad District
K Kavitha
TRS
Farmers
Telangana
EC
Symbols
  • Loading...

More Telugu News