Hyderabad: మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ.. ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్

  • హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • మహిళ కేకలతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు
  • యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు

మహిళ స్నానం చేస్తుండగా తన మొబైల్ ద్వారా వీడియో తీసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. తుర్కయాంజాల్‌ పరిధిలోని మనుగనూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన  ఇంట్లో స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి  గంగపురి వెంకటేష్‌ (22) తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నాడు. గమనించిన బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు పారిపోతున్న యువకుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని రిమాండ్‌కు తరలించారు.

Hyderabad
Telangana
Hayatnagar
mobile
video
  • Loading...

More Telugu News