Ram madhav: దేశాన్ని రక్షిస్తావా?.. ముందు రాష్ట్రంలో గెలిచి చూపించు: చంద్రబాబుకు బీజేపీ నేత రాంమాధవ్ సవాల్

  • దేశ ప్రజలంతా మోదీ వెంటే.. మళ్లీ ప్రధాని ఆయనే
  • ఏపీలో అసమర్థ, అవినీతి, కుటుంబ పాలన
  • పది సీట్లు కూడా దక్కించుకోలేని కేసీఆర్ ప్రధాని అవుతారట

దేశాన్ని రక్షిస్తానని చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలుత రాష్ట్రంలో గెలిచి చూపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సవాలు విసిరారు. నెల్లూరులో శుక్రవారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో అసమర్థ, అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందన్నారు. దేశాన్ని రక్షిస్తానంటూ తిరుగుతున్న చంద్రబాబు తొలుత ఈ ఎన్నికల్లో గెలిచి చూపించాలన్నారు.

మళ్లీ అధికారంలోకి వచ్చేది మోదీయేనని, దేశ ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారని రాంమాధవ్ పేర్కొన్నారు. మోదీని తమ ప్రాంతం నుంచి పోటీ చేయాల్సిందిగా అన్ని ప్రాంతాల ప్రజలు కోరుతున్నారన్న ఆయన.. రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తామంటే అక్కడి నుంచి వద్దని జనాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా రాంమాధవ్ విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పట్టుమని పదిసీట్లు కూడా దక్కించుకోలేని కేసీఆర్ ప్రధానిని అవుతానని చెప్పడం హాస్యాస్పదమేనన్నారు.

Ram madhav
BJP
Nellore District
Chandrababu
Narendra Modi
KCR
  • Loading...

More Telugu News