Guntur District: లోకేశ్! ఆ విషయం గురించి మీ నాన్నను అడుగు: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే హితవు

  • మంగళగిరిలో అభివృద్ధి జరగలేదని లోకేశ్ అంటున్నాడు
  • అభివృద్ధి పనుల కోసం వినతిపత్రాలిచ్చాను
  • ఈ విషయాన్ని మీ నాన్నను అడుగు లోకేశ్

మంగళగిరి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెబుతున్న నారా లోకేశ్ వెళ్లి తన తండ్రిని ఈ విషయమై ప్రశ్నించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సూచించారు. మంగళగిరిలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం వినతిపత్రాలు ఇచ్చానా? లేదా? అన్న విషయాన్ని లోకేశ్ తన తండ్రిని అడగాలని సూచించారు.

ఇక్కడి నుంచి పోటీ చేయాల్సింది లోకేశ్ కాదని చంద్రబాబు అని అన్నారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పదలచుకుంటే చంద్రబాబు పోటీ చేసి ఉండాల్సిందని అన్నారు. తనపై పోటీ చేస్తే ఓడిపోతానని చంద్రబాబుకు తెలుసని, ఎందుకంటే, గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారా? ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం అధికారులతో కలిసి ముఖ్యమంత్రి సమీక్షలు జరిపారా?  అని ప్రశ్నించారు. ఇదే నియోజకవర్గంలో అక్రమంగా ఒక ఇంటిని ఆక్రమించుకుని చంద్రబాబు బతుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.

Guntur District
Mangalagiri
YSRCP
MLA
RK
  • Loading...

More Telugu News