Uttar Pradesh: ఒకే వ్యక్తిని తమ తమ అభర్థిగా ప్రకటించిన రెండు పార్టీలు!

  • ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర సంఘటన
  • తనుశ్రీ పేరును ప్రకటించిన రెండు పార్టీలు
  • విషయం గ్రహించిన కాంగ్రెస్
  • సుప్రియా పేరుతో మరో జాబితా

ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు జరుగుతుండటం సహజం. కానీ ఉత్తరప్రదేశ్‌లో అభ్యర్థుల ప్రకటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఒకే వ్యక్తిని రెండు పార్టీలు తమ అభ్యర్థిగా ప్రకటించాయి. అనంతరం విషయం గ్రహించిన ఓ పార్టీ ఆ అభ్యర్థి పేరును తొలగించింది.

ఉత్తరప్రదేశ్‌లో మాజీ మంత్రి కుమార్తె తనుశ్రీ త్రిపాఠీని మహారాజ్‌గంజ్ స్థానం అభ్యర్థిగా వారం క్రితం ప్రగతిశీల పార్టీ ప్రకటించగా.. నిన్న సాయంత్రం కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలోనూ ఆమె పేరుండటం విశేషం. వెంటనే తప్పును గ్రహించిన కాంగ్రెస్, తనుశ్రీ స్థానంలో సుప్రియా శ్రినేత్ అనే ప్రముఖ జర్నలిస్టు పేరును చేర్చి నేడు మరో జాబితాను విడుదల చేసింది.

Uttar Pradesh
Thanusri Tripati
Maharaj Gunj
Supriya Srineth
Journalist
  • Loading...

More Telugu News