Prakasam District: చీరాలలో నన్ను ఓడించాలంటే వాళ్ల తాతలు దిగి రావాలి: టీడీపీ అభ్యర్థి కరణం బలరాం

  • కరణంను 50 వేల మెజార్టీతో ఓడిస్తానన్న ఆమంచి 
  • ఇక్కడ వన్ సైడ్ పోలింగ్ జరుగుతుంది
  • టీడీపీ విజయం ఖాయం

ఈ ఎన్నికల్లో వైసీసీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ అభ్యర్థి కరణం బలరాం మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరణం బలరాంను 50 వేల మెజార్టీతో ఓడిస్తానని ఆమంచి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తనను ఓడించాలంటే వాళ్ల తాతలు దిగిరావాలంటూ తన గెలుపుపై కరణం ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలన్న ప్రశ్నకు కరణం జవాబిస్తూ, ప్రజలతో మమేకమై ఉంటానని, వర్క్ మైండ్ తో పని చేస్తానని, అనవసరమైన ఆలోచనలు తనకు లేవని, ప్రశాంతమైన వాతావరణంలో పని చేస్తానని చెప్పి సీఎం చంద్రబాబు తనను ఇక్కడి నుంచి పోటీ చేయమని చెప్పారని అన్నారు. చీరాలలో ‘నువ్వా? నేనా’ అన్న విధంగా ఎన్నికలు జరుగుతాయన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇక్కడ వన్ సైడ్ పోలింగ్ జరుగుతుందని, టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Prakasam District
chirala
karanam
Aamanchi
  • Loading...

More Telugu News